: విజయగర్వంతో న్యూయార్క్‌లో అభిమానులను కలవనున్న బాలయ్య


గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఘనవిజయం సాధించడంతో నందమూరి బాల‌కృష్ణ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. యూఎస్ లోను ఈ చిత్రానికి మంచి స్పందన వ‌స్తుండ‌డంతో బాలయ్య యూఎస్ టూర్‌లో విజ‌య గ‌ర్వంతో ప‌ర్య‌టిస్తున్నారు. తాజాగా డల్లాస్, డెట్రాయిట్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయ‌న మ‌రికాసేప‌ట్లో న్యూయార్క్‌లో అభిమానులతో ముచ్చ‌టించ‌నున్నారు. అనంత‌రం ఈ రోజు రాత్రి భార‌త్‌కి బ‌య‌ల్దేరుతారు. బాల‌య్య‌కు ఆయ‌న అభిమానులు యూఎస్‌లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తాజాగా డల్లాస్ లో బాల‌కృష్ణ‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న‌ వాహనం వెనుక కాన్వాయ్ గా వెళ్తూ జై బాల‌య్య నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News