: ఈ ప్రజా ప్రతినిధులను చూసి ఏమనుకోవాలి?: ట్వీటేసిన పవన్ కల్యాణ్


పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణా నదీ లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ కు క్షేమం కాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ గంట క్రితం తన ట్విట్టర్ ఖాతాలో పలు పోస్టులను పెట్టారు. 207 ఎకరాల మాగాణి భూములను రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్ స్ట్రాయ్ పోలవరం కాంట్రాక్టును పొంది, రైతుల భూమిని డంపింగ్ యార్డు చేసేసిందని ఆరోపించారు. కనీస వివేకాన్ని కూడా ప్రజా ప్రతినిధులు చూపడం లేదని, వారిని చూసి ఏమనుకోవాలని ప్రశ్నించారు. పోలవరంపై నెలకోసారి సమీక్ష జరుపుతున్న ప్రభుత్వం ఈ సమస్యపై ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారని, అన్యాయం జరుగుతోందని చెప్పుకోవడానికి వస్తుంటే పోలీసులతో కొట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News