: విషమించిన ఆరోగ్యం... ప్రవీణ్ కుమార్ దీక్ష భగ్నం
గడచిన నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో స్టీల్ ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి దీక్షను ఈ ఉదయం పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు స్పష్టం చేయడంతో, బలవంతంగా ఆయన్ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలించే సమయంలో దీక్షా స్థలి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, ప్రవీణ్ దీక్షను తాము కొనసాగిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కాగా, రిమ్స్ లో ప్రవీణ్ కు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.