: జల్లి'పట్టు' వీడని తమిళ యువత!
తమిళనాట జల్లికట్టు నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు మదురై ప్రాంతంలో ప్రారంభం కావాల్సిన జల్లికట్టు క్రీడలు ప్రారంభం కాలేదు. ఎద్దులను వాటి యజమానులు ఎవరూ సిద్ధం చేయలేదు. కేవలం ఆర్డినెన్స్ తీసుకు వస్తే, తాము ఒప్పుకోబోమని, దీనికి శాశ్వత పరిష్కారం చూపి, భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తామన్న హామీ లభిస్తేనే తమ ఆందోళనలను విరమిస్తామని తమిళ యువత స్పష్టం చేస్తోంది. అప్పటివరకూ నిరసనలు కొనసాగిస్తామని, ఎద్దులను కదలనివ్వబోమని అంటున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా శాశ్వత పరిష్కారం కోసం కనీసం ఆరు నెలలు వేచి చూడాలని సీఎం పన్నీర్ సెల్వం మదురైలో మాట్లాడుతూ యువతకు విజ్ఞప్తి చేశారు. తమిళ సంప్రదాయాలను కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, పన్నీర్ సెల్వం చేత దిండిగల్ లో జల్లికట్టును లాంఛనంగా ప్రారంభింపజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.