: 'నువ్వు రావా ఇక్కడికి?' అంటూ కాంట్రాక్టర్ తో భూమా బెదిరింపు: ఇంటర్వ్యూ చేస్తూ ఆడియో వినిపించిన టీవీ చానల్


తెలుగు టెలివిజన్ చానల్ టీవీ-9 నిర్వహించే 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ'లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అసలు మీకెందుకు మంత్రి పదవి ఇవ్వాలి? ఏ ప్రాతిపదికన ఇవ్వాలని అడిగితే ఏం చెబుతారు? వంటి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. 'ఇక సెటిల్ మెంట్లు, ఆక్రమణలు, కాంట్రాక్టర్లను బెదిరించడం... అంతేనా?' అంటూ ప్రశ్నించి, ఆ తర్వాత ఓ కాంట్రాక్టరుతో 'నువ్వు రావా ఇక్కడికి?...' అంటూ బెదిరిస్తున్నట్టున్న భూమా ఫోన్ సంభాషణను వినిపించారు.

ఆ గొంతు తనదేనని భూమా అంగీకరించారు కూడా. "భూమా నాగిరెడ్డి అంటే... మేం మనుషులం కాదా? మాకు మానవత్వం ఉండదా? డబ్బు ఆశ లేదని నేను చెప్పడం లేదే... సంపాదించుకోవాలని మాకూ ఉంటుంది" అని భూమా చెప్పిన సమాధానాలను ప్రోమోలో భాగంగా టీవీ-9 చూపిస్తోంది. ఈ ఇంటర్వ్యూ నేడు ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News