: శాంసంగ్ ను వదిలేసి యాపిల్ ను పట్టుకున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన వాడుతున్న స్మార్ట్ ఫోన్ మారిపోయింది. ఇంతవరకూ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ను ట్రంప్ వాడుతూ రాగా, ఇప్పుడాయన చేతుల్లోకి యాపిల్ ఐఫోన్ వచ్చి చేరింది. భద్రతా కారణాల రీత్యా ఫోన్ ను మార్చాలని అధికారులు చేసిన సూచన మేరకు ట్రంప్ స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. కాగా, ఒబామా కూడా అధ్యక్షుడు కాకముందు బ్లాక్ బెర్రీ ఫోన్ ను వాడి, అధ్యక్షుడైన తరువాత ఈ ఎనిమిదేళ్లూ యాపిల్ ఐఫోన్ వాడారని గుర్తు చేసింది. కాగా, శాంసంగ్ సంస్థ దక్షిణ కొరియాకు చెందినది కావడంతోనే ట్రంప్ దాన్ని వదిలేసి, అమెరికాకే చెందిన యాపిల్ ను పట్టారని సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.