: ట్రంప్ వ్యాఖ్యలతో అదిరిపడుతున్న పాకిస్థాన్!


అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంపై పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ముస్లిం సమాజాన్ని లక్ష్యం చేసుకుంటూ, భూమిపై నుంచి ఇస్లామిక్ టెర్రరిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు తాను పని చేస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మిగతా ముస్లిం దేశాల మాటెలా ఉన్నా, పాక్ అదిరిపడుతోంది. ట్రంప్ వ్యాఖ్యలు పాక్ కు నష్టాన్ని కలిగించేవేనని, పదవీ విరమణ చేసిన పాక్ ప్రభుత్వ ఉద్యోగులు వ్యాఖ్యానించారు.

ఉగ్రవాద గ్రూపులుగా ప్రపంచం ముందు గుర్తించబడ్డ పలు సంఘాలు పాక్ భూభాగంపైనే ఉన్నాయని, ఇతర దేశాల్లో ఉగ్రదాడులకు తమ భూమిపై నుంచే కుట్రలు జరుగుతున్నా, పాక్ మిన్నకుందన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోకుంటే, తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇస్లామిక్ ప్రపంచానికి జరిగే నష్టం ఎంతైనా, అందులో అత్యధికం తామే అనుభవించాల్సి వుంటుందన్న సంగతి పాక్ పాలకులు అర్థం చేసుకోవాలని వారు సూచించారు. ట్రంప్ వ్యాఖ్యల గురించి తాము గట్టిగా ఆలోచించాల్సి వుందని, పాక్ ప్రభుత్వం సత్వరమే ఉగ్రవాద ముద్రను తొలగించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News