: 'హీరాఖండ్' ప్రమాదంతో రద్దయిన రైళ్ల వివరాలు!


గత రాత్రి విజయనగరం జిల్లాలోని కూనేరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంతో, దాదాపు అర కిలోమీటరు దూరం వరకూ పట్టాలు ధ్వంసం కాగా, ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. మరికొన్ని దూరప్రాంత రైళ్లను దారి మళ్లించినట్టు చెప్పారు. ధన్‌ బాద్‌ - అలెప్పి ఎక్స్‌ ప్రెస్‌, హతియా - యశ్వంత్‌ పూర్‌ ఎక్స్‌ ప్రెస్‌ లను టిట్టాగఢ్‌ - రాయ్‌ పూర్‌ - నాగ్‌ పూర్‌ మార్గంలో, నాందేడ్‌-సంబల్‌ పూర్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను కుర్దారోడ్డు - అంగుల్‌ మీదుగా మళ్లించామని వెల్లడించారు. సంబల్‌ పూర్‌ -నాందేడ్‌ ఎక్స్‌ ప్రెస్‌, రాయగడ - విశాఖపట్నం, విశాఖపట్నం - కోరాపుట్‌ ప్యాసింజర్‌ రైల్ సర్వీసులను రద్దు చేశామని, విజయవాడ - రాయగఢ ప్యాసింజర్‌ ను విశాఖ వరకూ కుదించామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News