: ట్రంప్ ను కలవనున్న తొలి దేశాధినేత ఎవరో తెలుసా?


అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి ఏ దేశానికి చెందిన నేతను కలవనున్నారన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తొలిసారిగా కలవనున్న ఆ విదేశీ నేత బ్రిటన్‌ ప్రధాని థెరెస్సా మే! వచ్చేవారం ఆమె వాషింగ్టన్‌ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమెతో ట్రంప్ బేటీ కానున్నారని 'ద డెయిలీ టెలిగ్రాఫ్‌' పత్రిక కథనం ప్రచురించింది. ఆమె అమెరికాలో రెండు రోజులు పర్యటించనుండగా, ఓవల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించే అవకాశముందని ఈ కధనం తెలిపింది. కాగా, ట్రంప్‌ ప్రధాన వ్యూహకర్త స్టీవ్‌ బానన్‌ విజ్ఞప్తి మేరకు థెరెస్సా మే పర్యటన ఖరారైందని, దీంతో వారి భేటీకి అధికారులు సర్వం సన్నద్ధం చేశారని ఆ కథనం పేర్కొంది. 

  • Loading...

More Telugu News