: ప్రభుత్వ ఉద్యోగితో కాళ్లు పట్టించుకుని క్షమాపణలు చెప్పించుకున్న అసోం బీజేపీ ఎమ్మెల్యే!


ఆఫీసు గేటుకు అడ్డుగా నిలిపిన ఎమ్మెల్యే కారును తీయించిన ఉద్యోగితో బీజేపీ ఎమ్మెల్యే కాళ్లు పట్టించుకుని క్షమాపణలు చెప్పించుకున్న ఘటన అసోంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... అసోంలోని నాగావ్‌ జిల్లా రాహా నియోజకవర్గంలో కొటియాటోలి డెవలప్‌ మెంట్‌ బ్లాక్‌ లో జయంత దాస్‌ జూనియర్‌ ఇంజనీర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే దింబేశ్వర్‌ దాస్‌, కొటియాటోలి డెవలప్‌ మెంట్‌ బ్లాక్‌ కు ఇన్ స్పెక్షన్ కు వెళ్లారు.

ఆ సమయంలో ఆయన తన కారును కార్యాలయ గేట్ కు అడ్డంగా నిలిపి వెళ్లారు. దీనిని గమనించిన జయంత దాస్‌ సదరు కారును అక్కడి నుంచి తీసేయించారు. ఈ విషయం అనుచరుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే జయంతపై ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆయన ఆగ్రహాన్ని చూసిన జయంత ఆయన కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరారు. ఈ తతంగం మొత్తాన్ని టీవీ ఛానెళ్లు చిత్రీకరించగా, మీడియాకు మాత్రం అలాంటిదేమీ జరగలేదని దింబేశ్వర్ సమాధానమివ్వడం కొసమెరుపు. 

  • Loading...

More Telugu News