: రిజర్వేషన్ల జోలికి వస్తే దళితులే బుద్ధి చెబుతారు: బీజేపీకి మాయావతి హెచ్చరిక


కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల జోలికి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న దళితులు తగిన బుద్ధి చెబుతారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ మాయావతి హెచ్చరికలు జారీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పబ్లిసిటీ చీఫ్‌ మన్మోహన్‌ వైద్య 'జైపూర్‌ సాహితి' ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, రిజర్వేషన్ల కొనసాగింపుపై ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు. కొంతమంది దొంగలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా రిజర్వేషన్లను నిలిపివేయాలని చూస్తే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిని ఎవరూ హరించలేరని ఆమె స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News