: జల్లికట్టుపై తమిళంలో ట్వీట్ పెట్టి ఆనందాశ్చర్యాలలో ముంచెత్తిన సెహ్వాగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ రారాజుగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా క్రికెట్, సామాజిక అంశాలపై స్పందించే సెహ్వాగ్ జల్లికట్టు ఆందోళనలపై స్పందించాడు. అది కూడా తమిళంలో స్పందించడం విశేషం. ‘జల్లికట్టుపై ఆర్డినెన్స్ కు కేంద్రాన్ని ఒప్పించడం తమిళ ప్రజల అద్భుత విజయం, ఇప్పుడు జల్లికట్టు నిర్వహించడం అనివార్యం’ అంటూ తమిళంలో పేర్కొన్నాడు. దీనిని చూసిన తమిళ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.