: ‘జల్లికట్టు’ కన్నా వంద రెట్లు బలమైంది సమైక్యాంధ్ర ఉద్యమం: ఎమ్మెల్యే బోండా


‘జల్లికట్టు’ కన్నా వంద రెట్లు బలమైంది సమైక్యాంధ్ర ఉద్యమం అని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని, అమరావతిలో పర్యటించే అర్హత జగన్ కు లేదని, ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న జగన్ ప్రతిపక్ష నేతగా ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు. కాగా, ‘జల్లికట్టు’పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలంటూ తమిళ ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని, ఏపీ సర్కార్  స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా సాధించాలని ఏపీలో విపక్ష పార్టీలు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలువడ్డ వ్యాఖ్యలపైనే ఎమ్మెల్యే బోండా ఉమ పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News