: కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవినీతిని ప్రోత్సహించేలా ఉన్నాయి!: ఎలక్షన్ కమిషన్


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర పార్టీలు డబ్బిస్తే తీసుకోండని... ఓటు మాత్రం ఆప్ కే వేయాలని కేజ్రీవాల్ ఓటర్లకు ఇచ్చిన సలహాను ఈసీ తప్పుబట్టింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవినీతిని ప్రోత్సహించేలా ఉన్నాయని తెలిపింది. తమ నోటీసులకు కూడా కేజ్రీవాల్ స్పందించకుండా, ధిక్కార స్వరాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నెల 8వ తేదీన గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్... కాంగ్రెస్, బీజేపీలు డబ్బిస్తే తీసుకోవాలని... ఓటు మాత్రం ఆప్ కే వేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 19న తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్ ను ఈసీ ఆదేశించింది. అయినప్పటికీ ఆయన హాజరుకాలేదు. తాను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదంటూ ట్విట్టర్ ద్వారా మాత్రమే స్పందించారు. దీంతో, ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News