: ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్న తమిళ యువత


తమిళనాట గత ఐదు రోజులుగా చెలరేగిన ఆందోళనకు ఆర్డినెన్స్ తో రాష్ట్ర ప్రభుత్వం చెక్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించడంతో జల్లికట్టు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధురై జిల్లాలోని అలంగానెల్లూరులో రేపు ఉదయం జల్లికట్టును ప్రారంభించనున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలు చల్లార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై ఆర్డినెన్స్ తెచ్చిందని పేర్కొంటున్నారు. తమ డిమాండ్ కు ఆర్డినెన్స్ పరిష్కారం కాదని, జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడమే తమ సమస్యకు పరిష్కారమని వారు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News