: పార్టీలకతీతంగా బీహార్ ప్రజలు నెలకొల్పిన ప్రపంచ రికార్డు!


బీహార్ ప్రజలు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వారు నెలకొల్పిన రికార్డును మూడు శాటిలైట్లు ( నాసాకు చెందిన రెండు స్వదేశీ, ఒకటి విదేశీ శాటిలైట్), నాలుగు విమానాలు, రెండు హెలికాప్టర్లు, 40 డ్రోన్లు చిత్రీకరించడం విశేషం. మద్యపాన నిషేధానికి మద్దతుగా మధ్యాహ్నం 12:15 నిమిషాల నుంచి 1:00 గంట వరకు సుమారు 45 నిమిషాలపాటు 11,000 కిలోమీటర్ల పొడవైన మానవహారం నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీహారీలు రోడ్లపైకి వచ్చి చేయిచేయి కలిపి నిల్చున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర రాజకీయ ప్రముఖులు, ప్రజలు పాలు పంచుకున్నారు. 2015 ఏప్రిల్ 5 నుంచి నితీష్ కుమార్ మద్య నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. విమర్శలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా ఆయన మద్యనిషేదాన్ని కొనసాగిస్తుండడం విశేషం. 

  • Loading...

More Telugu News