: పంజాబ్ లో నాకు పోలీస్ భద్రత అవసరంలేదు: కేజ్రీవాల్
పంజాబ్ లో తనకు పోలీస్ భద్రత అవసరం లేదని, వెంటనే తొలగించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కోరారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాశారు. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, తనకు కేటాయించే భద్రతా సిబ్బందిని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు బదలాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా, పంజాబ్ లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్ ఇటీవల పర్యటించిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆయనకు పోలీస్ భద్రత కల్పించారు.