: అబిడ్స్ లో హోటల్ భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
హైదరాబాదులోని అబిడ్స్ లో ప్యాలెస్ హోటల్ వద్ద విషాదం నెలకొంది. ప్యాలెస్ హోటల్ భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళను కింగ్ కోఠికి చెందిన అలంకృత (32) గా గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.