: భారత్ కు స్నేహ హస్తం చాచిన పాకిస్థాన్.. భారత జవాన్ చందు బాబుల్ చౌహాన్ విడుదల
ఇప్పటిదాకా భారత్ తో సై అంటే సై అన్న పాకిస్థాన్... ఇప్పుడు భారత్ కు స్నేహ హస్తం చాచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సర్జికల్ దాడులు జరిపిన మరుసటి రోజు పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్ చందు బాబుల్ చౌహాన్ ను విడుదల చేసింది. పొరపాటున సరిహద్దు దాటిన చందును పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతన్ని విడిపించేందుకు కేంద్ర హోం, విదేశాంగ శాఖలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జవాన్ చందును వాఘా సరిహద్దు వద్ద పాక్ సైన్యం అప్పగించింది.. మానవీయ కోణంలో భారత జవాన్ విడుదలకు అంగీకరించామని చెప్పింది.