: ‘పెటా’కు నోటీసులు ఇచ్చిన నటుడు సూర్య


‘జల్లికట్టు’కు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టిన జంతు సంరక్షణ సంస్థ (పెటా)పై  ప్రముఖ నటుడు సూర్య మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పెటాకు నోటీసులు ఇచ్చాడు. సినిమాల ప్రచారం కోసమే ‘జల్లికట్టు’కు సినీ నటులు మద్దతు ఇస్తున్నారని ‘పెటా’ ఎలా చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు. కాగా, తమిళ సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై మొదటి నుంచి సూర్య తన నిరసన వ్యక్తం చేశాడు. నిషేధం ఎత్తివేయాలంటూ చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు సూర్య తన మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News