: అత్యంత కిరాతకం...మాంసం తినాలనిపించి బాలుడ్ని హత్య చేసి.. రక్తం తాగి, గుండె విసిరేశాడు!
పంజాబ్ లో చోటుచేసుకున్న ఘటన గురించి తెలుసుకుంటే ఎలాంటి వారైనా భయంతో వనికిపోవడం ఖాయం. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని డుంగ్రీలో దిలీప్ కుమార్ అనే బాలుడు సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో దిలీప్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ నివాసానికి దగ్గర్లో ఉన్న సీసీటీవీ పుటేజ్ ను పరిశీలించారు. అందులో దిలీప్ తన నివాసానికి దగ్గర్లో ఉన్న ఎనిమిదవ తరగతి విద్యార్థి (16) తో కలిసి కనిపించాడు. దీంతో పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే దిలీప్ కుమార్ ను హత్య చేశానని తెలిపాడు.
సోమవారం తనకు మాసం తినాలనిపించిందని, తనకు పచ్చి మాంసమంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఆ సమయంలో ఇంటి బయటకు వచ్చి చూడగా దిలీప్ కుమార్ కనిపించాడని, గాలిపటం (పతంగి), దారం (మాంజా) ఇస్తానని తన ఇంటికి తీసుకెళ్లానని, బాత్రూంకి తీసుకెళ్లి, పదునైన ఆయుధంతో దిలీప్ కుమార్ ను హతమార్చానని, అతని శవాన్ని ఆరు భాగాలుగా కోసి రక్తం తాగి, ఆ భాగాలను ఇంటికి దూరంగా పారేశానని, గుండెను మాత్రం స్కూల్ ఆవరణలో పడేశానని చెప్పాడు. తనకు టీచర్లంటే కోపమని చెప్పాడు. వారికి చెడ్డపేరు రావాలనే స్కూల్ ఆవరణలో గుండె పడేశానని తెలిపాడు. తనకు పచ్చిమాంసమంటే చాలా ఇష్టమని, తన చేతులతో పట్టుకుని కొరుక్కుని తినాలనిపించేదని చెప్పడంతో...అతనిని మానసిక చికిత్స కేంద్రానికి తరలించారు.