: ఫిబ్రవరి నెలాఖర్లో శీతాకాల సమావేశాలు ...10 నుంచి మహిళా సాధికారిక సదస్సు: స్పీకర్ కోడెల
ఫిబ్రవరి చివరిలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉంటాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇకపై అన్ని సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని అన్నారు. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో మహిళా సాధికారిక సదస్సు నిర్వహించనున్నామని, పన్నెండు వేల మంది మహిళలు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 2500 కళాశాలలకు ఆహ్వానం పంపామని, ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం ఉండాలనేది తమ ఆలోచన అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ప్రధాని, లోక్ సభ స్పీకర్ సదస్సుకు హాజరుకానున్నారని కోడెల చెప్పారు.