: యాదవులకే కాదు, బహుజన సమాజానికీ చాగంటి క్షమాపణలు చెప్పాలి: సీపీఐ నేత రామకృష్ణ
యాదవ కులస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు చేసిన చాగంటి, యాదవులకే కాదు బహుజన సమాజానికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల సాధనకై ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు సీపీఐ బస్సు యాత్ర నిర్వహించనుందన్నారు. కాగా, యాదవుల భాగ్యాన్ని, వారి అమాయకత్వాన్ని వర్ణించేటప్పుడు తెలుగు భాషలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మాటను తాను అన్నానని, దాని వలన ఎవరైనా బాధ పొంది ఉంటే తాను క్షంతవ్యుడనని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్న విషయం విదితమే.