: ఏకాంతంగా గడిపిన ఫొటోలను చూపించి రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేసిన ప్రియురాలు!
ప్రియుడితో ఏకాంతంగా గడిపిన సమయంలో తీసుకున్న ఫొటోలను చూపి, కోటి రూపాయలు ఇవ్వాలంటూ ప్రియుడిని ప్రియురాలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు నామక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ (26) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి బెంగళూరుకు చెందిన అర్చన (22)తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత కొంతకాలం ఇద్దరూ ఆనందంగా గడిపారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న నగ్న ఫొటోలను ప్రియుడికి చూపించి, ఇప్పటికే లక్షలు లాగేసింది. ఆ తర్వాత కోటి రూపాయలు ఇవ్వకపోతే ఫొటోలు బయట పెడతానని బెదిరించింది. దీంతో, ప్రేమ్ కుమార్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చిన పోలీసులు... ప్రేమ్ కుమార్ నుంచి అర్చనకు రూ. 4 లక్షలు ఇప్పించి, సమస్యను పరిష్కరించారు.