: చంద్రబాబుకు భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు
ఏపీ సీఎం చంద్రబాబుకు భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు అధికారులకు ఈ మేరకు సమాచారం అందింది. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీఎం సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని ఈ మేరకు సూచించింది. అదనంగా మరో ఎన్ఎస్ జీ బృందాన్ని చంద్రబాబుకు కేటాయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.