: ములాయం సింగ్ కు మరో ఎదురుదెబ్బ!


సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటిదాకా తన కుడి భుజంగా భావించిన సీనియర్ నేత అంబికా చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్పీలోకి అన్ని పదవులకు రాజీనామా చేశానని... ఇకపై తన జీవితాన్ని బీఎస్పీకి అంకితం చేస్తున్నానని అంబికా చౌదరి తెలిపారు. అఖిలేష్ ప్రభుత్వంలో ఆయన బీసీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అంబికా చౌదరి పార్టీని వీడటం ములాయంకు బాధాకరమే అని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News