: రాజధానికి చంద్రబాబుతో పట్టిన అరిష్టం పోవాలంటూ వైఎస్సార్సీపీ శుద్ధి కార్యక్రమం


ఏపీ రాజధాని అమరావతికి చంద్రబాబుతో పట్టిన అరిష్టం పోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. రాజధానిలో చంద్రబాబు తిరిగిన రోడ్లపై గో పంచకం, పసుపు నీళ్లు చల్లుతూ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రానికి చంద్రబాబు వచ్చిన తర్వాతే అరిష్టం పట్టుకుందని, అరిష్టం పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. మూడు పంటలు పండించే రైతులు ఇప్పుడు వలసపోతున్నారని, రైతులు, రైతు కూలీల పరిస్థితి దుర్భరంగా మారిందని, రాజధానిలో టీడీపీ నేతలు బినామీలుగా మారారని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, జగన్ పర్యటనను జీర్ణించుకోలేకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News