: బాబు గారు, మీకు దండం పెడతా.. అమరావతిలోకి జగన్ ను రానివ్వొద్దు: ఆనం వివేకా
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం వివేకా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి జగనేనని, పోలవరం, పట్టిసీమకు అడ్డుపడటం సరికాదని అన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ మట్టిలో కలిసిపోతుందని, ముఖ్యమంత్రిని అవుతానంటూ జగన్ కాకిలా అరుస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ‘బాబు గారు, మీకు దండం పెడతా..అమరావతిలోకి జగన్ ను రానివ్వొద్దు. రాష్ట్ర యువత భవిష్యత్ అమరావతిలో ఉంది. రాబోయే రోజుల్లో 26 జిల్లాలు అవుతాయి. రెండేళ్ల తర్వాత రాష్ట్రపతి విడిది అమరావతిలోనే’ అని ఆనం వివేకా పేర్కొన్నారు.