: భారత్ చేరుకున్న సరబ్ జిత్ కుటుంబ సభ్యులు


భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులు ఈరోజు భారత్ చేరుకున్నారు. సరబ్ 'వైద్య పరంగా' మరణించాడని నిన్న అతడి సోదరి దల్బీర్ కౌర్ కు వైద్యులు తెలిపారు. దాంతో వారు స్వదేశానికి చేరుకున్నారు. దీనిపై షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ వైస్ ఛైర్మన్ రాజ్ కుమార్ వెక్రా మాట్లాడుతూ.. సరబ్ ఎప్పుడో చనిపోయినా పాక్ ప్రభుత్వం కావాలనే నాటకమాడిందని ఆరోపించారు. అటు సరబ్ జిత్ ను పరిశీలించేందుకు భారత డాక్టర్లకు అనుమతివ్వాలని కోరుతూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేస్తానని లాయర్ అవాయీస్ షేక్ చెప్పారు. 23 సంవత్సరాలుగా పాకిస్థాన్ లోని కోట్ లఖ్ పత్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సరబ్ జిత్ పై నాలుగురోజుల కిందట అనూహ్యంగా తోటి ఖైదీలు ఇద్దరు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అతని తలకు తీవ్ర గాయాలవడంతో కోమాలోకి వెళ్లాడు.

  • Loading...

More Telugu News