: హిల్లరీ, బిల్ క్లింటన్ రావడం గౌరవంగా భావిస్తున్నాను: ట్రంప్


డెమొక్రాటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు యూఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిల్లరీ, బిల్ క్లింటన్ లు పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని, వారితో కలిసి నిలబడేందుకు ఇష్టపడతానని, వారంటే తనకు ఎనలేని గౌరవమని, తామంతా మంచివాళ్లమని, ఒకటే కోరుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, హిల్లరీ గురించి ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో సమావేశ ప్రాంగణంలోని వారందరూ ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. విశేషం ఏమిటంటే, ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కీలక నేతలు హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News