: ఎంపీ గల్లా జయదేవ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం


టీడీపీ ఎంపీ గల్ల జయదేవ్ కు చెందిన అమర్ రాజా ఫ్యాక్టరీలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామం వద్ద అమర్ రాజా బ్యాటరీ విడి భాగాల పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు వ్యాపిస్తుండటంతో, కార్మికులంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News