: ఫిబ్రవరి 7న బ్యాంక్‌ల ఒకరోజు సమ్మె.. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించాలంటూ డిమాండ్!
నోట్ల రద్దు సమయంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 7న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్టు కొన్ని బ్యాంక్ ట్రేడ్ యూనియన్లు ప్రకటించాయి. నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్ చర్యలు తీసుకుంటాయని భావించిన తమకు నిరాశే ఎదురైందని పేర్కొన్నాయి. బ్యాంకులకు ఇప్పటి వరకు కూడా నగదు సరఫరా పూర్తిస్థాయిలో జరగలేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. తమతోపాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని ఆయన వివరించారు.