: జైసల్మేర్ వద్ద రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్
రాజస్థాన్‌లోని జైసల్మేర్ వద్ద రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని పది బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడుస్తున్న పలు రైళ్లను వివిధ స్టేషన్లలో ఆపేశారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.