: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం


అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా ఒబామా ఇచ్చిన తేనీటి విందు అనంతరం 'ఇనాగ్యురేషన్' ఫంక్షన్ గా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని వివిధ క్రైస్తవ సంఘాలకు చెందిన మతబోధకుల ప్రార్థనలతో ప్రారంభించారు. క్వయర్ గ్రూప్ పాటలతో వేడుకను రక్తి కట్టించారు. రెండు బైబిళ్లపై ఆయన ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ రెండు బైబిళ్లు ట్రంప్ కు ప్రత్యేకమైనవి కావడం విశేషం. అవి ఒకటి తన తల్లి బహుకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్‌ ప్రమాణం చేసింది కావడం విశేషం. ఆయన చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. పెన్ ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రమాణ స్వీకారం చేసిన బైబిల్ ను ఎంచుకున్నారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అమెరికా మాజీ అధ్యక్షులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అమెరికా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి సుమారు 9 లక్షల మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ ముందుకు చేరుకున్నారు. అనంతరం ‘అమెరికా ప్రధాన రహదారి’గా పిలిచే పెన్సిల్వేనియా ఎవెన్యూ గుండా దాదాపు 2.4 కిలోమీటర్ల మేర వైట్‌ హౌస్‌ వరకు ఊరేగింపు ఉంటుంది. రాత్రి అధికారిక విందుతో ప్రమాణస్వీకార వేడుక ముగియనుంది. ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడ్డ వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వివిధ దేశాలకు చెందిన కళాకారులతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ వేలాదిమంది అమెరికన్లు ర్యాలీ చేస్తున్నారు. అమెరికాలోని అన్ని నగరాల్లో ట్రంప్ వ్యతిరేకులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం విశేషం.  

  • Loading...

More Telugu News