: ఒక 500 రూపాయల నోటు తయారీకి ఖర్చెంతో తెలుసా?


డీమానిటైజేషన్ అనంతరం తయారైన కొత్త 500 రూపాయల నోటు తయారీకి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా? అక్షరాలా మూడు రూపాయల తొమ్మిది పైసలు. ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్‌బీఐ) లిఖిత పూర్వకంగా తెలిపింది. ముంబైకి చెందిన అనిల్‌ గల్గలి అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ లిఖితపూర్వక సమాధానం చెప్పింది. దీంతో 500 రూపాయల నోటు తయారీకి 3.09 రూపాయలు ఖర్చవుతుందని స్పష్టం చేసింది.

అయితే త్వరలో వినియోగంలోకి రానున్న 1000 రూపాయల నోటు తయారీకి ఎంత ఖర్చవుతుందన్న సంగతి మాత్రం తయారు చేయలేదు. కాగా, 2016-17లో నోట్ల ముద్రణ కాంట్రాక్టు పొందిన 'భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ముద‍్రన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' ఈ 500 రూపాయల నోటు తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కాంట్రాక్టు విలువగానీ, ఇప్పటివరకు ఎన్ని నిధులు ఖర్చు చేసిందన్న సంగతి కానీ వెల్లడించలేదు. ప్రజలకు తప్పనిసరిగా తెలియాల్సిన విషయాలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News