: అష్ట దిగ్బంధనంలో వైట్ హౌస్!


కాసేపట్లో అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు భారీ ఎత్తున వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో వైట్ హౌస్ కు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలను భద్రతా బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. డేగకళ్లతో వచ్చిపోయేవారిని నిశితంగా గమనిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిగానీ ఎవరినీ వైట్ హౌస్ పరిసరాల్లోకి పంపడం లేదు. వైట్ హౌస్ సమీప గగనతలం ప్రాంతాలను వేయికళ్లతో గమనిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అమెరికాకు చెందిన అన్నిరకాల భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. నూతన అధ్యక్షుడుతోపాటు కాసేపట్లో బాధ్యతలు వీడనున్న అధ్యక్షుడు కూడా ఒకే ప్రాంతంలో ఉండడంతో మరింత అప్రమత్తంగా, మరింత నిశితంగా పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నారు. 

  • Loading...

More Telugu News