: చంచల్ గూడ జైల్లో సందడి చేసిన హీరో నితిన్!
ప్రముఖ సినీ నటుడు నితిన్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో సందడి చేశాడు. నితిన్ చర్లపల్లి జైలుకెందుకెళ్లాడన్న అనుమానం వచ్చిందా? ఎవరినీ కలిసేందుకు కాదు... 'అ...ఆ' సినిమా తరువాత 14 రీల్స్ బ్యానర్ పై హను రాఘవపూడి (కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేం) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కోసం నితిన్ చర్లపల్లి జైలుకు వచ్చాడు. ఈ సందర్భంగా చర్లపల్లి జైలులో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హాస్య నటుడు పృధ్వీ, బ్రహ్మాజీ, హీరో నితిన్ కాంబినేషన్ లో కొన్ని సీన్లను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన సీన్లు చిత్రీకరించాల్సి వస్తే... మరోసారి చర్లపల్లి జైలుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమాలో నితిన్ పాతబస్తీ యువకుడిగా నటిస్తున్నాడు.