: కోల్ కతాలో ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడ్డ క్రికెటర్లు
భారత పర్యటనలో భాగంగా చివరిదైన మూడో వన్డే ఆదివారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం కటక్ నుంచి బయల్దేరిన టీమిండియా, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు కోల్ కతా చేరుకున్నారు. అక్కడి నుంచి ఈడెన్ సమీపంలో ఉన్న హోటల్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నేడు కోల్ కతాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వివిధ ప్రాంతాల్లో పర్యటించడంతో భారీ ట్రాఫిక్ జామ్ లు చోటుచేసుకున్నాయి. దీంతో క్రికెటర్లు వెళ్తున్న బస్సు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంది. దీంతో ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో క్రికెటర్లను చూసిన కోల్ కతా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. బీసీసీఐ మాత్రం ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందింది.