: వెలుగు చూసిన వాస్తవం...ఐసిస్ అంటే లాడెన్ కు కూడా భయమే!


ఇస్లాం సామ్రాజ్య స్థాపనకు వికృత క్రీడతో ప్రపంచదేశాలను భయాందోళనలకు గురిచేసిన ఐఎస్ఐఎస్ సంస్థ ప్రపంచ ప్రఖ్యాత ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను కూడా ఆందోళనకు గురి చేసిందని సీఐఏ విడుదల చేసిన పత్రాల్లో వెల్లడైంది. ప్రపంచం నలుమూలల ఉన్న ఇస్లాం ఉగ్రవాద సంస్థలను కలుపుకుని తొలుత అమెరికాను ధ్వంసం చేసి, ఆ తరువాత ప్రపంచం మీద దండ యాత్రకు వెళ్లాలని లాడెన్ భావించేవాడు. ఈ క్రమంలో ఐసిస్ సంస్థను కూడా సంప్రదించాడు. అయితే వారి వికృతమైన హింసాత్మక ఆలోచనలు విని షాక్ కు గురయ్యేవాడని తెలుస్తోంది.

హింసకు పాల్పడేందుకు వ్యూహాలు రచించడంలో ఏమాత్రం కనికరం చూపకపోవడంతో అల్ ఖైదా కంటే ఐఎస్ఐఎస్ కు పేరు వస్తుందని ఆందోళన చెందేవాడట. అంతే కాకుండా తన కుమారులకు ఎలక్ట్రానిక్‌ చిప్‌ లు ఇంజెక్ట్‌ చేసే అవకాశం ఉందని, కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండేవాడని తెలుస్తోంది. అంతే కాకుండా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆవేశంలో ఎత్తుకొచ్చే కొందరు విదేశీ ప్రముఖులను స్వయంగా కల్పించుకుని విడిపించేవాడని సీఐఏ గుర్తించిన పత్రాల్లో వెలుగు చూసింది. 

  • Loading...

More Telugu News