: కాశ్మీర్ మాజీ సీఏం ఒమర్ అబ్దుల్లాను బ్లాక్ చేసిన ఎయిర్ ఇండియా!
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఎయిరిండియా బ్లాక్ చేసింది. ఆయనను బ్లాక్ చేస్తున్నట్టు ఆయనకు సమాచారం ఇచ్చిన ఎయిరిండియా అందుకు కారణాలు వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఒమర్ అబ్దుల్లా ఈ విషయం చెబుతూ ఎయిరిండియా తనకు పంపిన ట్వీట్ ను కూడా పోస్టు చేశారు. గతంలో ఆయన స్వల్పకాలిక ప్రయాణాల్లో కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే ఎందుకు సర్వ్ చేస్తున్నారని ప్రశ్నించారు.