: ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టుకు జరిమానా విధించిన ఐసీసీ


టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు నిన్న కటక్‌లో రెండో వ‌న్డే ఆడిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఓవర్లు నెమ్మదిగా వేసిన కార‌ణంగా ఆ జ‌ట్టుకి ఫైన్ వేస్తున్న‌ట్లు ఐసీసీ తెలిపింది. కెప్టెన్ మోర్గాన్‌కు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం, జట్టులోని మిగతా ఆటగాళ్లపై 10 శాతం కోత విధించినట్లు చెప్పింది.
 
కాగా, భార‌త్‌, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య చివరి వన్డే ఈ ఆదివారం కోల్‌కతాలో జరగనుంది. ఇప్ప‌టికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఆ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని చూస్తోంది.

  • Loading...

More Telugu News