: ‘ద రైజ్ ఆఫ్ శివగామి’ కవర్ పేజీ ఆవిష్కరణకు అనూహ్య స్పందన వచ్చింది: దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి


ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర శివగామి. ఈ పాత్ర ఆధారంగా ‘ద రైజ్ ఆఫ్ శివగామి’ అనే పుస్తకాన్ని ప్రముఖ రచయిత నీలకంఠన్ రచించారు. కాగా, జయపురలో ఈరోజు జరిగిన సాహిత్య వేడుకలో ఈ పుస్తకం కవర్ పేజీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి సహా  ‘బాహుబలి’ చిత్ర బృందం హాజరైంది.

ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్ చేస్తూ, ‘ ‘ద రైజ్ ఆఫ్ శివగామి’ పుస్తకం కవర్ పేజీ ఆవిష్కరణకు చాలా తక్కువ మంది వస్తారని భావించాను. కానీ, అనూహ్య స్పందన వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. మార్చి 7వ తేదీ నుంచి ఈ పుస్తకం అందుబాటులోకి వస్తుందని చెప్పిన రాజమౌళి, ఆ పుస్తకం కవర్ పేజీతో పాటు, ఆయన దిగిన సెల్ఫీని  పోస్ట్ చేశారు. కాగా, ‘బాహుబలి: ద బిగినింగ్’ కంటే ముందు ఏం జరిగిందనే విషయాలను ‘ద రైజ్ ఆఫ్ శివగామి’లో రాశారట. 

  • Loading...

More Telugu News