: గల్ఫ్ దేశాల్లో 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని వారం పాటు నిలిపేశారు!
ఇద్దరు పెద్ద స్టార్లు నటించిన 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్ తో రెండు సినిమాలు విడుదలైనా... బాలయ్య సినిమాను చిరంజీవి సినిమా వారం పాటు వెనక్కి నెట్టింది. గల్ఫ్ దేశాల్లో ఇది చోటు చేసుకుంది. ఒక రోజు ముందు విడుదలైన ఖైదీ సినిమాను అక్కడ అన్ని థియేటర్లలో విడుదల చేశారట. బాలయ్య శాతకర్ణి సినిమా ఇక్కడ విడుదలైనా... అక్కడ ప్రదర్శించడానికి థియేటర్లు దొరకలేదట.
దీంతో, సినిమా నిర్మాతలు కూడా చేసేదేంలేక మిన్నకుండిపోయారట. దీంతో, ఇప్పుడు దుబాయ్ తెలుగు అసోసియేషన్ రంగంలోకి దిగింది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు థియేటర్లను కేటాయించేలా చర్యలు తీసుకుంది. దీంతో, వారం తర్వాత అక్కడ బాలయ్య సినిమా రిలీజ్ అయింది. ఆల్రెడీ సినిమా సూపర్ హిట్ కావడంతో... గల్ఫ్ లో కూడా బలయ్య సినిమాకు వసూళ్లు బాగున్నాయట. దీంతో బాలయ్య సినిమాకు ఓవర్సీస్ కలెక్షన్లు పెరుగుతాయని అంటున్నారు.