: వైజాగ్ వాసంతి 'కిడ్నాప్' డ్రామాయేనా?


విశాఖపట్టణంలోని గాజువాక సమీపంలోని మల్కాపురంలో ఉన్న కోరమండల్ ఫెర్టిలైజర్స్ గేటు వద్ద వాసంతి అనే యువతి కిడ్నాప్ కు గురైందన్న వార్త పెనుకలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనెల 18న ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. వాసంతి మొబైల్ నెంబర్ తొలుత తుని సమీపంలో ట్రేస్ కావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. అనంతరం గుంటూరు సమీపంలో ట్రేస్ కావడంతో రాజధాని ప్రాంత పోలీసులను కూడా రంగంలోకి దించారు.

ఇంతలో 19వ తేదీ ఉదయం గాజువాక బస్టాండ్ వద్ద ఇంటికి ఫోన్ చేసిన వాసంతి అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో పోలీసులు తీగలాగారు. వాసంతి ఫోన్ కాల్ లిస్టు బయటకి తీశారు. వాసంతి గత నెల రోజుల్లో ఒక ఫోన్ నెంబర్ కు 3,600 సార్లు మాట్లాడినట్టు గుర్తించారు. ఆ ఫోన్ వాసంతి కిడ్నాప్ సమయంలో ఆమెతో పాటు తిరిగినట్టు గుర్తించారు. దీంతో అసలేం జరిగిందో చెప్పాలని పోలీసులు వాసంతిని ప్రశ్నించగా, ఆమె నుంచి మౌనమే సమాధానంగా రావడంతో దీనిని డ్రామాగా తేల్చారు. 

  • Loading...

More Telugu News