: మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ యువరాజ్ సింగ్ సంబరాలు ఎలా చేసుకున్నాడో తెలుసా?


కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 150 పరుగులు సాధించిన యువరాజ్ సింగ్ సంబరాలు ఎలా చేసుకున్నాడో తెలుసా? ఒక రేంజ్ లో చేసుకుని ఉంటాడని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, యువరాజ్ సింగ్ భారీ స్కోరు సాధించిన అనంతరం మూడో వన్డే కోసం కటక్ ను వదలాల్సి వస్తుందని తెలుసు. అందుకే ఎలాంటి హడావుడి, సంబరాలు లేకుండా దగ్గర్లోనే ఉన్న ఓ ఆసుపత్రికి వెళ్లి కేన్సర్ పేషంట్లను కలిశాడు. కేన్సర్ ను ఎదుర్కోవడం పెద్ద విషయమేమీ కాదని, దానికి తానే ఉదాహరణ అని చెబుతూ, వారిలో స్పూర్తి నింపాడు. ఈ సందర్భంగా కేన్సర్ బాధితులతో ఫోటోలు దిగాడు. యువీ ఆసుపత్రికి రావడంతో వైద్యులు కూడా సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. 

  • Loading...

More Telugu News