: పాకిస్థాన్ లో నకిలీ బ్యాంక్ అకౌంట్ల కలకలం
పాకిస్థాన్ లో నకిలీ బ్యాంకు ఖాతాలు కలకలం రేపుతున్నాయి. ఆ దేశ ప్రతిపక్ష నేత, పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయిన ఆయాజ్ సాదిక్ పేరుతో బ్యాంకులో ఓపెన్ చేసిన నకిలీ ఖాతాలోకి ఇటీవలే ఆయనకు తెలియకుండానే రూ.10 కోట్లు వచ్చి పడ్డాయి. సాదిక్‌తో పాటు ఇటీవలే సెనెట్ ఛైర్మన్ రజా రబ్బానీ, పాక్ ప్రతిపక్ష నేత సయ్యద్ ఖుర్షిద్ల పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు వారి ఖాతాల్లో కోట్లాది రూపాయలు వేసేశారు. దీనిపై సర్కారు విచారణకు ఆదేశించింది. తమ పేర్లతో నకిలీ ఖాతాలు తెరచి ఈ నగదు వేశారని సాదిక్ చెప్పారు.
వీరి ముగ్గురి పేర్లతోనే కాదు.. ఆ దేశ సెనెట్‌లో అయితాజ్ అహసాన్, కశ్మీర్ కమిటీ ఛైర్మన్ మౌలానా ఫజులూర్ రెహ్మాన్‌లు కూడా ఇటువంటి ఘటనల్లో ఇరుక్కున్నారు. తమ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలు ఓపెన్ చేశారని వీరిరువురూ వాపోయారు. ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది.