: ధోనీ మీద ఒత్తిడి తగ్గించడానికే యువీని జట్టులోకి తీసుకున్నాం: కోహ్లీ


ఇంగ్లండ్ జట్టుతో సిరీస్ కు టీమిండియా జట్టును ఎంపిక చేసేముందు సెలెక్టర్లు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకున్నారని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. మ్యచ్ విజయానంతరం కోహ్లీ మాట్లాడుతూ, జట్టును ఎంపిక చేసే సమయంలో టాప్ ఆర్డర్ భారాన్ని తాను మోసినా, ధోనీకి సరైన అండలేకపోతే కష్టమని భావించామని తెలిపాడు. ధోనీ ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన ఆటగాడని, అలాంటి వ్యక్తిపై పూర్తి భారం వేయకూడదని అనుకున్నామని చెప్పాడు. దీంతోనే సెలెక్టర్లు, తాను యువీ, రాయుడు గురించి తీవ్రంగా చర్చించామని చెప్పాడు.

అయితే రాయుడు ప్రతిభావంతుడైనప్పటికీ చాలా కాలంగా గాయంతో బాధపడుతూ ఆటకు దూరమయ్యాడని, యువీ అయితే రంజీల్లో రాణించి తన ఫిట్ నెస్ తో పాటు ఫాం కూడా నిరూపించుకున్నాడని తెలిపాడు. అదీ కాక ధోనీతో సుదీర్ఘకాలం ఆడిన అనుభవం కూడా ఉందని భావించి యువీని జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. తొలి వన్డేలో రాణించకపోయినా ఆ లోటు రెండో వన్డేలో 150 పరుగుల భారీ స్కోరు చేయడం ద్వారా నిరూపించుకున్నాడని కోహ్లీ చెప్పాడు. 

  • Loading...

More Telugu News