: కొత్తరకం స్మగ్లింగ్.. చెప్పుల్లో 28 కేజీల బంగారం.. 8 మంది అరెస్టు!


ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేష‌న్‌లో పోలీసులు ఈ రోజు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్త‌ చెప్పుల జ‌త‌ల‌ మ‌ధ్య దాదాపు 28 కేజీల‌ బంగారు క‌డ్డీల‌ను పెట్టిన ఓ గ్యాంగ్ వాటిని అక్ర‌మంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు చిక్కింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ బంగారం రూ.8.3 కోట్ల విలువ చేస్తుంద‌ని పేర్కొన్నారు. శాండిల్స్ మ‌ధ్య భాగంలో ప‌రిశీలించి చూడ‌గా ఈ బంగారు క‌డ్డీలు క‌నిపించాయ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News