: మహిళల పట్ల జగన్ కు గౌరవం లేదా?: అఖిల ప్రియ
వైఎస్సార్సీపీ కార్యకర్తలు తనపై దాడికి యత్నించిన ఘటనపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంతవరకూ స్పందించలేదంటూ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ విమర్శించారు. మహిళల పట్ల జగన్ కు గౌరవం లేదా?, దాడులను జగన్ ప్రోత్సహిస్తున్నారా?, దాడి ఘటనను రాజకీయం చేయాలనుకుంటే, విజయవాడలోనే ఉండి తాను గొడవ చేసే దానినని ఆమె అన్నారు. వైఎస్సార్సీపీ జెండాలు పట్టుకుని, తాగి ఉన్న కొందరు తన కారుపై దాడి చేశారని, దానిని ఆ పార్టీ నేతలు ఖండించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారంటూ అఖిల ప్రియ వాపోయారు.