: బ్యాటింగ్ చేసే సమయంలో యువరాజ్, ధోనీల గేమ్ ప్లానింగ్ ఇదే!


నిన్న ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా అద్భుతంగా ఆడి 256 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఎన్నో ఏళ్ల పాటు కలసి ఆడిన యువీ, ధోనీకి మధ్య మంచి అవగాహన ఉంది. ఎంతో అనుభవం ఉన్న వీరిద్దరూ అంచెలంచెలుగా తమ లక్ష్యాలను నిర్మించుకుని భారీ స్కోరు సాధించారు. మ్యాచ్ ముగిసిన అనంతం, తామిద్దరూ టార్గెట్ ను ఎలా సెట్ చేసుకుంటూ ముందుకు సాగామో యువీ వివరించాడు.

"మాకు తెలుసు. మేమిద్దరం ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లం. తొలుత 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయాలని అనుకున్నాం. ఇందులో చెరో 25 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత 100 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్దేశించుకున్నాం. నేను బౌండరీలు కొడుతుంటే... ధోనీ స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఆ తర్వాత భారీ స్కోరు చేయాలని అనుకున్నాం. ధోనీ టీమిండియాకు సెలెక్ట్ అయినప్పటి నుంచి మేమిద్దరం కలసి ఆడుతూనే ఉన్నాం. ధోనీ కన్నా నేను కొంచెం ముందు జట్టులోకి వచ్చా. ధోనీకి, నాకు మధ్య చాలా అవగాహన ఉంది. వికెట్ల మధ్య పరిగెత్తే విషయంలో కూడా మంచి అవగాహన ఉంది. ఇకపై కూడా మేమిద్దరం ఇదే ఆటతీరును కొనసాగిస్తాం" అని యువరాజ్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News